పల్లవి
మేలుకోవయ్య మమ్మేలుకో రామ
మేలైన సీతా సమేత నా భాగ్యమా
చరణం - 1
నారదాదులు నిన్ను కోరి నీ మహిమ
లవ్వారిగా పాడుచున్నారిపుడు తెల్ల-
వారగా వచ్చినది శ్రీ రామ నవనీత
క్షీరములు బాగుగానారగింపను1 వేగ (మేలుకో)
చరణం - 2
ఫణి శయన అనిమిష రమణులూడిగము సేయ
అణుకువగ నిండారు ప్రణుతి జేసెదరు
మణి-మయాభరణులౌ2 అణిమాదులిడు3 దీప
మణులు తెలుపాయెను తరణి వంశ వర తిలక
చరణం - 3
రాజ రాజేశ్వర భ-రాజ ముఖ సాకేత
రాజ సద్గుణ త్యాగరాజ నుత చరణ
రాజన్య 4విబుధ గణ రాజాదులెల్ల నిను
పూజింప కాచినారీ జగము పాలింప (మేలుకో)